నిర్వాసితులకు నివాస పట్టాలను అందజేసిన ఎమ్మెల్యే యరపతినేని

నిర్వాసితులకు నివాస పట్టాలను అందజేసిన ఎమ్మెల్యే యరపతినేని 

 

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ 

 

పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం పులిచింతల ప్రాజెక్టు ముంపు నిర్వాసితులకు పునరావాసం క్రింద పిడుగురాళ్ళ మండలం న్యూ వెల్లంపల్లి, అయ్యప్ప నగర్ గ్రామాల్లో 64 మంది నిర్వాసితులకు నివాస పట్టాలను మంజూరు చేసి, రిజిస్ట్రేషన్ చేయించి గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు చేతుల మీదుగా నిర్వాసితులకు రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. అదే విధంగా పిడుగురాళ్ళ పట్టణంలోని మందులగడ్డలో 11 మంది ముస్లిం కుటుంబాలకు, గతంలో కూల్చేసిన ఇళ్ల స్థానంలో హైకోర్టు ఆదేశాల మేరకు యరపతినేని శ్రీనివాసరావు చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను పంపిణీ జరిగింది. 

 

ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ళ మండల తహసీల్దార్ జె.మధుబాబు, ఆయా గ్రామాలకు, పిడుగురాళ్ళ పట్టణానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.