పునః నిర్మాణ శంఖుస్థాపనకు బయలు దేరిన తెలుగు తమ్ముళ్ళు

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అమరావతి నవ్యాంధ్రప్రదేశ్ పునః నిర్మాణ శంఖుస్థాపన కార్యక్రమానికి పిడుగురాళ్ళ పట్టణం17వ సచివాలయం 32వ వార్డుకు చెందిన 80 మంది తెలుగుదేశం పార్టీ మహిళలు, కార్యకర్తలు లెనిన్ నగర్ నుంచి బయలు దేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో 32 వార్డు ఇంఛార్జి టిడిపి మస్తాన్ వలి, మాజీ కౌన్సిలర్ బత్తుల శ్రీనివాసరావు, 32వ వార్డు అధ్యక్షుడు తమ్మిశెట్టి రామారావు, 294 బూత్ కన్వీనర్ పఠాన్ ఖాసింసా,
32 వార్డు ప్రధాన కార్యదర్శి షేక్ భాషా (కొట్టు), 290వ బూత్ కన్వీనర్ శామ్ కొమ్ము ప్రకాష్, 294వ బూత్ యువత అధ్యక్షులు గుంజ కోటేశ్వరావు, ఐ టిడిపి షేక్ నాగుల్, కమిటీ సభ్యులు, 17వ సచివాలయం అధికారులు, ఆశా వర్కర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.