పల్నాడు పోలీస్ ఫోరెన్సిక్ సాక్ష్యాల నిర్వహణ వర్క్ షాప్ కార్యక్రమం

ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టరేట్ గుర్రం జాషువా కాన్ఫరెన్స్ హాల్ నందు శ్రీ ఎస్పీ గారి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ అధికారులకు “ఫోరెన్సిక్ సాక్ష్యాల నిర్వహణ (Forensic Evidence Management)” అనే అంశంపై నిర్వహించిన “చర్చా వేదిక (Work Shop)” కార్యక్రమం.

  • పాల్గొన్న పల్నాడు జిల్లా ఎస్సైలు, సీఐలు మరియు డిఎస్పీలు.
  • దర్యాప్తు ప్రక్రియకు ఉపకరించే అనేక మెళకువలను పోలీస్ అధికారులకు వివరించిన ఫోరెన్సిక్ నిపుణులు.
  • నిపుణులు అందించిన మెళకువలను క్షేత్ర స్థాయిలో ఉపయోగించి కేసుల్లో ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా సమగ్ర దర్యాప్తులు చేపట్టాలని సూచించిన శ్రీ ఎస్పీ గారు.

ఈ చర్చా వేదిక (Work Shop) ద్వారా ఏదైనా కేసుకు సంబంధించి ఘటన జరిగిన ప్రదేశం నుండి న్యాయస్థానంలో కేసు విచారణకు వెళ్ళే వరకు పొందుపరచే ప్రతి ఆధారాన్ని భౌతికంగా, సాంకేతిక పరంగా ఏ విధంగా సేకరించాలనే విషయాలను గురించి కూలంకషంగా వివరించిన ఫోరెన్సిక్ నిపుణులు.పలు అంశాలకు సంబంధించి ఈ చర్చా వేదిక నిర్వహించగా, వాటిలో ముఖ్యమైనవి :

  1. ఫోరెన్సిక్ సాక్ష్యాల నిర్వహణ(Forensic Evidence Management).
  2. సాక్ష్యాల సేకరణ విధానాలు/పద్ధతులు(Evidence Collection Procedures).
  3. గొలుసు పద్ధతిలో ఆధారాల అమరిక.(Chain of custody protocols).
  4. దర్యాప్తులో చేయదగినవి/ చేయకూడనివి.(Investigative Do’s and Don’ts).
  5. అధునాతన సాంకేతిక విధానాలు(Latest Scientific Trends).

 

పైన తెలిపిన అంశాల ఆధారంగా పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే దొంగతనం, హత్య, అత్యాచారం, ఆత్మహత్య, చైన్ స్నాచింగ్, రోడ్డు ప్రమాదాలు, మాదక ద్రవ్యాలు, సామాజిక మాధ్యమాలు మొదలగు పలు విషయాలకు సంబంధించిన కేసుల్లో ఘటన జరిగిన ప్రదేశం నుండి న్యాయస్థానాలలో కేసుకు సంబంధించిన ఆధారాలు ప్రవేశపెట్టే వరకు ఉన్న అన్ని ఘట్టాల్లో

భౌతిక ఆధారాలు అనగా ఆయుధాలు, వస్త్రాలు, పదార్థాలు మరియు వివిధ వస్తువులు వంటివి.

సాంకేతిక ఆధారాలు అనగా ఘటన ప్రదేశంలో వేలి,కాలి ముద్రలు,రక్తపు మరకలు, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లు, వీడియో/ఆడియో రికార్డింగ్ లు, ఫోటోలు వంటివి.వాటిని ఏ విధంగా సేకరించాలి..?, ఏ విధంగా సేకరిస్తే వాటికి చట్టబద్ధత వస్తుంది..? అని పలు కోణాల్లో అవగాహన కల్పించడం జరిగింది.

ఇటువంటి ప్రత్యేక చర్చా వేదిక(Work Shop) కార్యక్రమాల నిర్వహణకు ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపిఎస్ గారికి, సౌత్ కొస్టల్ జోన్ ఐ జి సర్వ శ్రేష్ట త్రిపాఠి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అదే విధంగా ఈ చర్చా వేదిక నందు జిల్లా పోలీసు అధికారులకు కేసుల దర్యాప్తుకు సంబంధించి పలు మెళకువలను అందజేసిన ఫోరిన్సిక్ నిపుణుల బృందానికి కూడా కృతఙ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపిన శ్రీ ఎస్పీ గారు.

ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్పి గారితో పాటు ఫోరెన్సిక్ సైంటిఫిక్ అధికారులు D. కాంచన గోదర గారు, L. స్వాతి గారు K. సురేంద్రబాబు గార్లు, ఫోరెన్సిక్ అసిస్టెంట్ డైరెక్టర్లు B. రామకృష్ణారావు గారు, పల్నాడు జిల్లా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

కార్యక్రమం అనంతరం ఫోరెన్సిక్ సైంటిఫిక్ అధికారులకు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు శాలువా కప్పి మెమొంటో తో సత్కరించారు.