‘నిజం గెలిచింది.. నీతి నిలిచింది’ : చంద్రబాబు అక్రమ అరెస్టుపై 53 కొవ్వొత్తులతో చీఫ్ విప్ జీవీ దంపతులు

📰 Generate e-Paper Clip

‘నిజం గెలిచింది.. నీతి నిలిచింది’

  • చంద్రబాబు అక్రమ అరెస్టుపై 53 కొవ్వొత్తులతో చీఫ్ విప్ జీవీ దంపతులు

 

అక్షర ఉదయమ్ – వినుకొండ

 

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం నారా చంద్రబాబు నాయుడిపై తప్పుడు కేసులు పెట్టి, 53 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసన సభ్యులు జీవీ ఆంజనేయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ‘నిజం గెలిచింది.. నీతి నిలిచింది’ అనే పిలుపులో భాగంగా జీవీ తన నివాసంలో సతీమణి, శివశక్తి ఫౌండేషన్ చైర్‌పర్సన్ లీలావతితో కలిసి 53 కొవ్వొత్తులు వెలిగించారు. ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును అర్ధరాత్రి వేళ అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని జీవీ మండిపడ్డారు. కుట్రలు, అక్రమ కేసులు సత్యాన్ని ఎక్కువ కాలం అణచి వేయలేవని, కోట్లాది మంది ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని తెలిపారు. ప్రజా బలమే టీడీపీకి శ్రీరామరక్ష అని, నాటి చీకటి రోజును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కొవ్వొత్తులు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నారని ఆయన పేర్కొన్నారు.