మహిళలు ధైర్యంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉన్నప్పుడే మహిళా సాధికారత సాధ్యం అవుతుంది

అక్షర ఉదయమ్ – గుంటూరు

 

మహిళలు ధైర్యంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉన్నప్పుడే మహిళా సాధికారత సాధ్యం అవుతుంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సమును పురస్కరించుకొని గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు “మహిళ సాధికారత ర్యాలీ” నిర్వహించిన పోలీసు అధికారులు.

గుంటూరు జిల్లా పోలీస్ పరేడ్ మైదానం నుండి మూడు బొమ్మల సెంటర్ మీదుగా తిరిగి పరేడ్ మైదానం వరకు గుంటూరు జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి శ్రీ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ “మహిళా సాధికారత ర్యాలీ” ను జిల్లా అదనప ఎస్పీ(ఏఆర్) శ్రీ A. హనుమంతు గారు జెండా ఊపి ప్రారంభించారు.

మహిళలు సమాజంలో ధైర్యంగా, స్వతంత్రంగా ఉంటూ లింగ సమానత్వాన్ని, హక్కులను స్వేచ్ఛగా అనుభవించినప్పుడే మహిళా సాధికారిత సాధించినట్లు అర్దం చేసుకోవచ్చు అని తెలిపారు.

మహిళ సాధికారత వారోత్సవాల్లో భాగంగా మహిళల ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి మహిళ ఫిర్యాదులు విండో కార్యక్రమాన్ని నిర్వహించామని, మహిళ రక్షణ మరియు భద్రతకు సంబంధించి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను గుంటూరు పోలీసు వారు నిర్వహిస్తారని మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ గారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.