రాష్ట్రంలో క్రమంగా ఎండ తీవ్రత పెరుగుతుందని ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు

📰 Generate e-Paper Clip

రాష్ట్రంలో క్రమంగా ఎండ తీవ్రత పెరుగుతుందని ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు. శుక్రవారం 42°C- 43.5°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రేపు మన్యం జిల్లా పాలకొండ, తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలాల్లో తీవ్రవడగాలులు(3), 21 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

రేపు అల్లూరి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పిడుగులు, ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు.

శనివారం 4 మండలాల్లో తీవ్ర, 15 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. రేపు శ్రీకాకుళం-3, విజయనగరం-6, పార్వతీపురంమన్యం -6, అల్లూరి సీతారామరాజు- 3, కాకినాడ-2, తూర్పుగోదావరి-1 మండలాల్లో (21) వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

ఇవాళ సాయంత్రం 5 గంటల నాటికి కాకినాడ జిల్లా కాజులూరులో 49.5మిమీ, వైఎస్సార్ జిల్లా బెస్తవేములలో 43 మిమీ, చిత్తూరు జిల్లా పెదపంజానిలో 39.7మిమీ, కృష్ణా జిల్లా గుడివాడలో 21మిమీ, అల్లూరి జిల్లా గంపరైలో 20.5మిమీ వర్షపాతం నమోదైందన్నారు.

వడగాలులు వీచే మండలాల వివరాలు లింక్లో:
https://apsdma.ap.gov.in/files/dca8e09dd95d8d13d33803abd6a8c803.pdf

గురువారం పల్నాడు జిల్లా క్రోసూరులో 41.6°C, ప్రకాశం జిల్లా దరిమడుగులో 41.5°C, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 40.9°C, తిరుపతి జిల్లా రేణిగుంటలో 40.8°C, బాపట్ల జిల్లా వల్లపల్లిలో 40.5°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు.

ఎండలో బయటకు వెళ్లేప్పుడు నెత్తికి టోపి పెట్టుకోండి లేదా రూమాలు కట్టుకోండి, తెలుపురంగు గల కాటన్ వస్త్రాలను ధరించండి. అదేవిధంగా మీ కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించండి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు.