పేదోడికి ఒక్క రూపాయికే నవతరం పార్టీ టిక్కెట్
- నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం బంపర్ ఆఫర్
అక్షర ఉదయమ్ – విజయవాడ

మునిసిపల్ ఎన్నికల్లో నిరుపేద అభ్యర్థులకు తాము టిక్కెట్లు ఇస్తామని, ఒక్క రూపాయి విరాళం తీసుకొని ఛైర్మన్, మేయర్, కౌన్సిలర్ అభ్యర్థులకు టిక్కెట్లు ఇస్తామని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎన్నికలు డబ్బు ప్రస్తావన లేకుండా జరగాలంటే ముందు రాజకీయ పార్టీలు మంచి అభ్యర్థులను ఎంపిక చేయాలని అన్నారు. అటువంటి అభ్యర్థులు ముందుకు వస్తే అన్నీ పదవులకు పోటీ చేయిస్తామని రావు స్పష్టం చేశారు. కేవలం ఒక్క రూపాయి తీసుకుని “బి ఫారం” ఇస్తామని రావు సుబ్రహ్మణ్యం ప్రకటనలో తెలిపారు.