పీజీఆర్‌ఎస్‌ సేవలపై క్యూఆర్‌ కోడ్‌తో స్పందన – పల్నాడు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా

📰 Generate e-Paper Clip

పీజీఆర్‌ఎస్‌ సేవలపై క్యూఆర్‌ కోడ్‌తో స్పందన

  • పల్నాడు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా

 

అక్షర ఉదయమ్ – నరసరావుపేట

 

 

పల్నాడు జిల్లా కలెక్టర్‌ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) సేవలను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రజలు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తమ అభిప్రాయాలను తెలియ జేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా పిలుపునిచ్చారు. జిల్లా, మండల స్థాయి పీజీఆర్‌ఎస్‌ కేంద్రాలు, హెల్ప్‌ డెస్క్‌ల వద్ద అందుబాటులో ఉంచిన క్యూఆర్‌ కోడ్‌ను మొబైల్‌తో స్కాన్‌ చేసి నేరుగా అధికారిక పోర్టల్‌లో ఫీడ్‌బ్యాక్‌ నమోదు చేయవచ్చని తెలిపారు. సమర్పించిన అర్జీల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని, ప్రతి సోమవారం జరిగే ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.