స్థానిక సమరానికి సై అంటున్న టీడీపీ – 28 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించిన అధిష్ఠానం

📰 Generate e-Paper Clip

స్థానిక సమరానికి సై అంటున్న టీడీపీ

 

  • 28 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించిన అధిష్ఠానం
  • అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు బదులు సీనియర్లకు అప్పగింత
  • మిత్ర పక్షాలతో సమన్వయం, ప్రచారంపై ఇన్‌ఛార్జ్‌లకు కీలక బాధ్యతలు
  • ఫలితాల్లో తేడా వస్తే ఒప్పుకోనని కుప్పం నేతలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక

 

అక్షర ఉదయమ్ – విజయవాడ

 

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సర్వ సన్నద్ధమవుతోంది. ఈ దిశగా ఎన్నికల కసరత్తును వేగ వంతం చేస్తూ, రాష్ట్రంలోని 28 జిల్లాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఈసారి సరికొత్త వ్యూహాన్ని అనుసరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

జిల్లాల వారీ ఇన్‌ఛార్జ్‌‌లు

 

  • పార్వతీపురం మన్యం – దాడి రత్నాకర్
    అల్లూరి సీతారామరాజు – పేరాబత్తుల రాజశేఖర్ 
  • శ్రీకాకుళం – ఎండీ నజీర్
  • విజయనగరం – ఎంపీ చింతకాయల విజయ్
  • విశాఖపట్నం – ఎంఏ షరీఫ్
  • అనకాపల్లి – కొండపల్లి అప్పలనాయుడు
  • పోలవరం – కె సత్తిబాబు
  • కాకినాడ – సుజయ్ కృష్ణరంగారావు
  • డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ – ఎంపీ సానా సతీష్
  • తూర్పు గోదావరి – దేవినేని ఉమామహేశ్వరరావు
  • పశ్చిమ గోదావరి – ఎంపీ భాష్యం రామకృష్ణ
  • ఏలూరు – ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ
  • కృష్ణా – కొమ్మాలపాటి శ్రీధర్
  • ఎన్టీఆర్ – మక్కెన మల్లికార్జునరావు
  • గుంటూరు – ఎంవీ సత్యనారాయణరాజు
  • పల్నాడు – కొనకళ్ల నారాయణ
  • బాపట్ల – జంగా కృష్ణమూర్తి
  • ప్రకాశం – ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
  • మార్కాపురం – ఎమ్మెల్సీ బీటీ నాయుడు
  • నెల్లూరు – ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ
  • తిరుపతి – నూకసాని బాలాజీ
  • చిత్తూరు – దామచర్ల సత్య
  • కడప – దీపక్ రెడ్డి
  • అన్నమయ్య – ఎమ్మెల్సీ శ్రీకాంత్
  • అనంతపురం – ఏరాసు ప్రతాప్‌రెడ్డి
  • శ్రీ సత్యసాయి – సోమిశెట్టి వెంకటేశ్వర్లు
  • కర్నూలు – పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి
  • నంద్యాల – వైకుంఠం ప్రభాకర్ చౌదరి